గాండీవధారి అర్జున ట్రైలర్: మెడికల్ ఇష్యూతో వస్తున్న వరుణ్ తేజ్ సినిమా
ఈ వార్తాకథనం ఏంటి
వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్ లో సినిమా గురించి ఎక్కువ విషయాలు తెలియలేదు. ఏదో మెడికల్ ఇష్యూ గురించి సినిమా కథ నడుస్తుందని అర్థమవుతోంది.
పర్యావరణాన్ని రక్షించే ఆఫీసర్ గా నాజర్ కనిపిస్తుంటే ఆయనకు సాయం చేసే పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తున్నట్లు అర్థమవుతోంది.
షూటింగ్ ట్రైలర్ లో కనిపించిన దాని ప్రకారం, సినిమా మొత్తం ఫారెన్ లొకేషన్లలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Details
ఫారెన్ లొకేషన్లలో సినిమా
ట్రైలర్ లో చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి. అయితే ట్రైలర్ చివర్లో, భూమికి పట్టిన క్యాన్సర్ మనిషే అని నాజర్ పలికే డైలాగ్ ఆసక్తిగా ఉంది.
విమలారామన్, వినయ్ రాయ్, నరైన్, అభినవ్ గొమఠం ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.
గని తర్వాత వస్తున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.