Page Loader
Ratan Tata's Documentary: 'మెగా ఐకాన్' రతన్ టాటా డాక్యుమెంటరీ.. మిమ్మల్ని పెద్దగా కలలు కనేలా ప్రేరేపిస్తుంది
'మెగా ఐకాన్' రతన్ టాటా డాక్యుమెంటరీ.. మిమ్మల్ని పెద్దగా కలలు కనేలా ప్రేరేపిస్తుంది

Ratan Tata's Documentary: 'మెగా ఐకాన్' రతన్ టాటా డాక్యుమెంటరీ.. మిమ్మల్ని పెద్దగా కలలు కనేలా ప్రేరేపిస్తుంది

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2024
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గొప్ప విలువలు కలిగిన మనసున్న వ్యక్తి పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరనే వార్త ఎంతోమందిని కలచివేస్తోంది. ఆయన లేని లోటు తీరనిది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన్ను గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన బయోపిక్‌, డాక్యుమెంటరీల గురించి వెతుకుతున్నారు. ఈ దార్శనికుడి గురించి డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓ ఎపిసోడ్‌ చేసింది. 'మెగా ఐకాన్‌స్' సీజన్‌2లో ఎపిసోడ్‌2లో రతన్‌ అతిథిగా హాజరై తన (Ratan Tata) ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. తక్కువ ధరలో కారు తీసుకురావాలనే ఆలోచన వెనక ఉన్న కారణాన్ని వివరించారు.

వివరాలు 

ఆసియా టెలివిజన్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యిన డాక్యుమెంటరీ 

'ఒకసారి నేను కారులో వెళ్తూ స్కూటర్‌పై వెళ్తున్న కుటుంబాన్ని చూశాను.తల్లి,తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురూ ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. కొంతసేపటికి వాళ్లు జారి కిందపడ్డారు. ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. స్కూటర్‌ను సేఫ్టీగా ఎలా మార్చాలి అని ఆలోచించాను. ఆ ఆలోచనే తక్కువ ధరకు కారు తయారుచేసేలా ప్రోత్సహించింది'అని రతన్ తెలిపారు. దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన పడిన కష్టాన్ని ఆ ఎపిసోడ్‌లో రతన్‌ వివరించారు. ప్రస్తుతం ఇది ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో దీన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్‌ అవార్డుకు నామినేట్‌ అయి.. ఉత్తమ డాక్యుమెంటరీగా సిరీస్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

వివరాలు 

బయోపిక్‌పై వార్తలు 

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర ఈ దార్శనికుడి బయోపిక్‌ తీయనున్నట్లు 2022లో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నటించనున్నట్లు బాలీవుడ్ హీరోలు అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, దీనిపై సుధా కొంగర స్పష్టతనిచ్చారు. 'రతన్ టాటా అంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం. ప్రస్తుతానికి ఆయన బయోపిక్ తీయడం లేదు' అని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. స్ఫూర్తినింపే పుస్తకాలు రతన్‌ టాటా జీవితం, ఆయన ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులపై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఇవి వ్యాపార ఔత్సాహికులతో పాటు సామాన్యులకు కూడా పాఠాలు నేర్పుతాయి. ఆయన విలువలు ఈ పుస్తకాల రూపంలో ఎప్పటీకీ సజీవంగానే ఉంటాయి. సమాజానికి జ్ఞానాన్ని పంచుతూనే ఉంటాయి.