Chiranjeevi 157: యంగ్ డైరెక్టర్‌తో మెగాస్టార్ కొత్త సినిమా; సోషియో ఫ్యాంటసీతో వస్తున్న చిరంజీవి
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాపై అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి 157వ సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యంగ్ డైరెక్టర్‌కు చిరంజీవి అవకాశం ఇచ్చారు. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో ఉంటుందని తెలుస్తోంది.
చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్ ఆగస్ట్ 11న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించలేకపోతోందని టాక్ వినిపిస్తోంది.
బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ చిరంజీవి 157 సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నట్లు తెలుస్తోంది.
DETAILS
నవంబర్ నెలలో ముల్లోక వీరుడు
చిరు, వశిష్ఠ కాంబోలో సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ డేట్లు కూడా ఇచ్చేశారని టాక్.
దీనికి 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ఖరారయ్యే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది.
చిరు సినీ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి మోడల్లోనే ఈ చిత్రం ఉండనుందట.
గతేడాది బింబిసారతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ, టేకింగ్, డైరెక్షన్ విభాగంలో అందరి మన్ననలు అందుకున్నారు.
సోషియో ఫ్యాంటసీ కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ ని చిరు చేయనున్నట్లు సమాచారం. సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ మెగాస్టార్ 156కు దర్శకత్వం వహించనున్నారు.