NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి? 
    తదుపరి వార్తా కథనం
    మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి? 
    మళయాలం సినిమా రీమేక్ లో చిరంజీవి అంటూ వార్తలు

    మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 15, 2023
    01:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాతో వస్తున్నారు చిరంజీవి.

    తమిళంలో సూపర్ హిట్ అందుకున్న వేదాళం చిత్రానికి రీమేక్ గా భోళాశంకర్ రూపొందుతోంది. తాజాగా చిరంజీవి ఖాతాలో మరో రీమేక్ చేరిందని తెలుస్తోంది.

    మళయాల చిత్రమైన బ్రోడాడీ సినిమాను రీమేక్ చేయాలని చిరంజీవి భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కామెడీ డ్రామాగా రూపొందిన బ్రోడాడీ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు.

    ఈ సినిమా తెలుగు రీమేక్ మరికొద్ది రోజుల్లో మొదలవుతుందని చెప్పుకుంటున్నారు.

    Details

    చిరంజీవి కొడుకుగా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు 

    బ్రోడాడీ సినిమా తండ్రీ కొడుకుల కథ అనీ, ఈ సినిమా తెలుగు రీమేక్ లో తండ్రిగా చిరంజీవి నటిస్తారనీ, కొడుకుగా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.

    సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా శ్రీలీల కనిపించనుందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

    అయితే రీమేక్ సినిమాల్లో చిరంజీవి ఎక్కువగా కనిపించడాన్ని కొంతమంది అభిమానులు ఒప్పుకోవడం లేదు. ఇతర ఇండస్ట్రీల్లో సీనియర్లు చేస్తున్నట్లుగా కంటెంట్ బాగున్న కొత్త సినిమాల్లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.

    మరి రీమేకులు చేయడం చిరంజీవి ఆపుతారా? లేదా ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం తెరకెక్కుతోన్న భోళాశంకర్ చిత్రం, ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా 50అడుగుల ప్రభాస్ హోలోగ్రాఫిక్ ఇమేజ్  ఆదిపురుష్
    యాక్షన్ సీన్లే హైలైట్ గా ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వచ్చేసింది  ఆదిపురుష్
    ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ: హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా?  జూనియర్ ఎన్టీఆర్
    ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఖర్చు తెలుసా? క్రాకర్స్ కోసమే 50లక్షలు  ఆదిపురుష్

    సినిమా

    మండు వేసవిలో జుట్టు పిలకను ఫ్యాన్ గా వాడుతున్నాడంటూ అమితాబ్ బచ్చన్ కామెంట్  బాలీవుడ్
    చావు దెబ్బలు తిన్నా.. సునిశిత్ తగ్గట్లేదుగా.. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో బడితపూజ! జూనియర్ ఎన్టీఆర్
    'ది కేరళ స్టోరీ'పై బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు స్టే  కేరళ
    బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ: విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడా?  మూవీ రివ్యూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025