Page Loader
దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం 
దసరా సినిమాపై చిరంజీవి ప్రశంసలు

దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 13, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దసరా సినిమాను పొగడ్తలతో ముంచెత్తాడు. దసరా సినిమా చూసాననీ, నాని నటన చాలా బాగుందనీ అన్నాడు చిరంజీవి. అంతేకాదు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి మాట్లాడుతూ, ఇది తన మొదటి సినిమా అంటే నమ్మలేకుండా ఉందనీ, దర్శకుడిగా ఉత్తమ ప్రతిభ కనబరిచాడని ట్విట్టర్ వేదికగా ప్రశంసలు జల్లారు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్, దసరాలో సూరి పాత్రలో కనిపించిన దీక్షిత్ శెట్టిలను కూడా పొగిడారు చిరంజీవి.

Details

ఇతర భాషల్లో దసరాకు రాని ఆదరణ 

దసరా మూవీకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. రిలీజై 15రోజులు అవుతున్నా కూడా దసరాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. నాని కెరీర్ లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రంగా రికార్డ్ సృష్టించింది దసరా చిత్రం. మొదటి సినిమాతోనే వందకోట్ల దర్శకుడిగా మారిపోయాడు శ్రీకాంత్ ఓదెల. ఇతర భాషల్లో ప్రభావం చూపని దసరా: దసరా సినిమాను తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేసారు. కానీ తెలుగులో తప్ప ఇతర భాషల్లో పెద్దగా కలెక్షన్లు తెచ్చుకోలేక పోయింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన దసరా సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాని కి ట్వీట్ చేసిన మెగాస్టార్