భోళాశంకర్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరంజీవి మాస్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమా నుండి ఈరోజు ట్రైలర్ రిలీజైంది.
రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజైన ఈ ట్రైలర్, పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది.
ట్రైలర్ మొదట్లో, ఎవరో ఒక పాప కిడ్నాప్ అవుతుంది. ఆ పాపను వెతికి పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతుంది. దాంతో పోలీసులు చిరంజీవి పాత్ర భోళాశంకర్ హెల్ప్ తీసుకుంటారన్నట్టుగా చూపించారు.
కథలో సీరియస్ అంశాలతో పాటు మెగాస్టార్ స్టైల్ కామెడీ ఉందన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.
తెలంగాణ యాసలో చిరంజీవి పాత్ర మాట్లాడనుందని గతంలో టీజర్ లోనే వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లోనూ అదే కనబడింది. కాకపోతే ట్రైలర్ లో చిరంజీవి డైలాగ్స్ ఎక్కువగా రివీల్ చేయలేదు.
Details
రంగస్థలం సినిమాను గుర్తు చేసిన భోళాశంకర్ ట్రైలర్
రామ్ చరణ్ రంగస్థలం సినిమాను ట్రైలర్ లో తమన్నా గుర్తు చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరంజీవి కనిపిస్తున్నారు.
అటు మాస్ ప్రేక్షకులను, ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరించేలా భోళాశంకర్ ట్రైలర్ ను తీర్చిదిద్దారు.
తమన్నా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. సుశాంత్, వెన్నెల కిషోర్, షియాజీ షిండే కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. గెటప్ శ్రీను, శ్రీముఖి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం సినిమాకు రీమేక్ గా భోళాశంకర్ తెరకెక్కింది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.