LOADING...
Meher Ramesh: మెహర్ రమేశ్ కుమార్తె వివాహ వేడుక..ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబం
మెహర్ రమేశ్ కుమార్తె వివాహ వేడుక..ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబం

Meher Ramesh: మెహర్ రమేశ్ కుమార్తె వివాహ వేడుక..ప్రత్యేక ఆకర్షణగా మెగా కుటుంబం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 02, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆయన కుమార్తె మోహన వివాహం హైదరాబాద్‌లోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించారు. తోట చంద్రశేఖర్ కుమారుడు అనిరుధ్‌తో మోహన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన నిశ్చితార్థం అనంతరం, ఇప్పుడు ఈ జంట వివాహంతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి కార్యక్రమానికి విచ్చేసి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి హాజరై ఆశీస్సులు అందించారు.

వివరాలు

ప్రముఖుల హాజరు..

సినీ పరిశ్రమ నుంచి హీరో వెంకటేష్, దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఎన్. శంకర్, వీర శంకర్, నిర్మాతలు అల్లు అరవింద్, సి. అశ్వినీదత్, ఏఎం రత్నం, బన్నీ వాసు, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, నటుడు మురళీ మోహన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, యాంకర్ సుమ కనకాలతో పాటు మరెందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కొత్త జంటకు తమ ఆశీస్సులు అందించారు. రాజకీయ రంగం నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అంబటి రాంబాబు తదితర నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement

వివరాలు

మెగా ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం..

మెహర్ రమేశ్‌కు మెగా కుటుంబంతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. చిరంజీవి తల్లి అంజనా దేవి, మెహర్ రమేశ్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో, చిన్ననాటి నుంచే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మెగా కుటుంబానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొంటూ ఆ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఇటీవల చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భోళా శంకర్' చిత్రానికి కూడా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.

Advertisement