LOADING...
Mirai Trailer : అదరగొడుతున్న తేజ సజ్జా 'మిరాయ్‌' ట్రైలర్ ..

Mirai Trailer : అదరగొడుతున్న తేజ సజ్జా 'మిరాయ్‌' ట్రైలర్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న'మిరాయ్' అనే భారీ చిత్రం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో రితికా నాయక్,మంచు మనోజ్, శ్రియ,జగపతి బాబు,జయరామ్ లాంటి చాలా మంది స్టార్లు నటిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే,ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రం సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్,టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై మంచి అంచనాలు ఏర్పడాయి. తాజాగా మిరాయ్ ట్రైలర్ను ప్రేక్షకులకు అందించారు. అదనంగా, ఈ సినిమాలో మైథాలజికల్ (పౌరాణిక) టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది, ఇది కథనానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. అంతేకాదు, మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేసిన ట్వీట్