
Mirzapur 3 : మీర్జాపూర్ 3 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఓటిటి ప్రేక్షకులకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ వెబ్ సిరీస్‌లు తెగ అదరిస్తారు.
అలాంటి జోనర్‌లో వచ్చిన వెబ్ సిరీస్ 'మీర్జాపూర్'కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు తెరకెక్కించారు.
మీర్జాపూర్ సీజన్ 1, సీజన్ 2 విడుదల అయి రికార్డు స్థాయిలో విజయం సాధించింది.
దీంతో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ రికార్డుకెక్కింది.
Details
మూడో సీజన్ కోసం అతృతుగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు
తాజాగా ఈ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక మీర్జాపూర్ సీజన్ 3 ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని అమెజాన్ వెల్లడించింది.
ఈ మేరకు క్రిస్మస్, లేదా న్యూయర్ కానుగా మూడో సీజన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ మూవీపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు.
ఎక్సెల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రితేశ్ సిద్వానీ నిర్మించారు.