Sayli surve: నలుగురు పిల్లలతో కలిసి మాజీ 'మిస్ ఇండియా' మిస్సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మిస్ ఇండియా ఎర్త్ విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు కనిపించకుండా పోయిన ఘటన పుణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న సయాలీ, ఇటీవల తిరిగి హిందూమతంలోకి మారింది. ఆమె మత మార్పు జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు దారి తీస్తోంది. సయాలీని ఆమె భర్త, అత్తింటి వారు కిడ్నాప్ చేశారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు
మతం మారడమే కారణమా?
కొన్ని సంవత్సరాల క్రితం సయాలీ సర్వే ఇస్లాంలోకి మారి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన పేరును అతీజాగా మార్చుకున్నారు. వివాహం అనంతరం భర్త తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. ఇటీవల ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి ఆ ఇంటి నుండి బయటకు వచ్చి మళ్లీ హిందూమతాన్ని స్వీకరించారు. అలాగే తన పేరును ఆద్య సుర్వేగా మార్చుకున్నారు. ఈ పరిణామాల తర్వాత కొద్ది రోజులకే ఆమె పిల్లలతో సహా కనిపించకుండా పోవడం మరింత చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.