Page Loader
మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల
మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల

మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వచ్చేస్తున్నారహో.. ముహుర్తం ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంచులతో ఓ ముగ్గురు యువకులు చేసిన పిచ్చకామెడి సినిమా జాతి రత్నాలు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి పట్టాలు ఎక్కించాలనుకున్న పలు సినిమాలు పలు కారణాల రీత్యా ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ జాతిరత్నం రెండు సినిమాలు చేస్తున్నాడు. రెండింట్లో ఒకటైన మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా రిలీజ్ కు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 4న నిర్ణయించిన చిత్ర నిర్మాణ బృందం పోస్టర్ ను విడుదల చేసింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఒక చెఫ్‌కు, స్టాండప్‌ కమెడియన్‌కు మధ్య సాగే లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

DETAILS

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిలో హీరోయిన్‌గా అనుష్క

ఈ సినిమాకు మహేష్‌బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మిస్ శెట్టి అండ్ మిస్టర్ పొలిశెట్టి పబ్లిసిటీ పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. మరో సినిమా అనగనగా ఓ రాజులో నవీన్‌ పొలిశెట్టి నటిస్తున్నాడు. గతేడాది ఈ సినిమా గ్లింప్స్‌ను సైతం రిలీజ్‌ చేశారు. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి పురోగతి లేదు. ఎంత పెద్ద హిట్టు వచ్చినా సరే, స్టార్ డమ్ ఉన్నప్పటికీ అడపాదడపా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటేనే ఏ హీరోకైనా మనుగడ, ఆడియన్స్ గుర్తింపు ఉంటాయి. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా మారింది.