Thiruveer : సినిమాల కోసం తల్లిదండ్రుల కర్మకాండలు మిస్సయ్యా.. తిరువీర్ ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పాపం ప్రతాప్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎస్పి దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందుగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలలో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత విషాదకర సంఘటనను తిరువీర్ పంచుకున్నారు. సినిమాల పట్ల తనకున్న అంకితభావం కారణంగా ఎదుర్కొన్న మానసిక వేదనను వెల్లడిస్తూ.. గతంలో రెండు సినిమాల కంటిన్యూటీ సమస్యల వల్ల నా తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలు సరిగ్గా నిర్వహించలేకపోయాను.
వివరాలు
బంధువులు నన్న తప్పుబట్టారు
ఒక్కడే కొడుకువి అయ్యుండి ఈ మాత్రం కూడా చేయలేవా అని బంధువులు నన్ను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ గిల్ట్ ఇప్పటికీ నా మనసులో మిగిలే ఉంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా తిరువీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి సినిమా తీయడం ఒక విషయం అయితే, దాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం ఇప్పుడు మరో పెద్ద యుద్ధంలా మారింది. గత చిత్రాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ, థియేటర్లలో ఉన్నప్పుడే ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను చేరుకోలేకపోయాయనే బాధ ఉందని తెలిపారు.
వివరాలు
టికెట్ ధర కేవలం రూ.వంద మాత్రమే
ఈ నేపథ్యంలో ఈసారి 'పాపం ప్రతాప్' సినిమాను విస్తృతంగా ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో వినూత్నంగా ప్రమోషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని ఆనందంగా చూడగలిగే 'ఫీల్ గుడ్' ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. సాధారణ ప్రేక్షకుడికి సినిమా అందుబాటులో ఉండేలా టికెట్ ధరను కేవలం రూ. 100గా నిర్ణయించినట్లు తిరువీర్ వెల్లడించారు.