
మిస్టేక్: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న సస్పెన్స్ థ్రిల్లర్.. దాని విశేషాలు
ఈ వార్తాకథనం ఏంటి
100% తెలుగు కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నుండి సరికొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది.
ఇదివరకు రకరకాల జోనర్లలో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఆహా, ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తీసుకొస్తుంది.
మిస్టేక్ అనే టైటిల్ తో రూపొందిన సినిమాను అక్టోబర్ 13వ తేదీ నుండి ఆహాలో అందుబాటులో ఉంచనుంది.
ముగ్గురు ప్రేమ జంటల కథగా రూపొందిన మిస్టేక్ సినిమాలో, అభినవ్ సర్దార్, అజయ్ కతుర్వార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్, రాజా రవీంద్ర, సమీర్ నటించారు.
Details
భరత్ కొమ్మలపాటి డైరెక్ట్ చేసిన చిత్రం
ముగ్గురు స్నేహితులు తమ లవర్స్ ని తీసుకుని అడవికి బయలుదేరుతారు. అడవిలో వాళ్లకు కొన్ని సమస్యలు వస్తాయి.
ఆ సమస్యలను ఎదుర్కొనే సమయంలో ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఆ పొరపాటు కారణంగా ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటారు.
ఇంతకీ ఆ పెద్ద సమస్య నుండి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే మిస్టేక్ సినిమా కథ.
ఏ ఎస్ పి మీడియా హౌస్ బ్యానర్లో రూపొందిన మిస్టేక్ సినిమాకు అభినవ్ సర్దార్ నిర్మాతగా ఉన్నారు. భరత్ కొమ్మలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతాన్ని మనీ జెన్నా అందించారు.