
MM Keeravani-Murali Mohan: మురళీ మోహన్ మనుమరాలితో ఎంఎం కీరవాణి కుమారుడి పెళ్లి!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకుంటున్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అస్కార్ అవార్డుతో తెలుగు పరిశ్రమను ప్రపంచానికి తెలిపిన ఎం.ఎం కీరవాణి కుమారుడు హీరో శ్రీసింహ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
నిర్మాత, వ్యాపారవేత్త అయిన మురళీ మోహన్ మనుమరాలితో శ్రీసింహ ఏడు అడుగులు వేయనున్నాడని సమాచారం.
ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
శ్రీ సింహ ఇప్పటికే భాగే సాలే, మత్తు వదలరా, ఉస్తాద్ వంటి చిత్రాల్లో నటించి హీరోగా నిలదిక్కుకోనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పటికే బాబాయ్ రాజమోళీతో కలిసి పలు సినిమాలకు కూడా పనిచేశాడు.
Details
ఎలాంటి ప్రకటన చేయని ఇరు కుటుంబ సభ్యులు
మురళీ మోహన్‌కు ఒక అమ్మాయితో పాటు రామ్ మోహన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు.
ఆయన కుమార్తెనే శ్రీసింహకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారు.
వీరిద్దరి ప్రేమకు ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపి పెళ్లి ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వివాహం గురించి ఇటు కీరవాణి కుటుంబ నుంచి కానీ, మురళీ మోహన్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.