
Poonam Pandey: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ఇన్‌స్టాలో పూనమ్ పాండే పోస్టు
ఈ వార్తాకథనం ఏంటి
మోడల్, నటి పూనమ్ పాండే (Poonam Pandey) గర్భాశయ క్యాన్సర్‌తో శుక్రవారం మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తన మరణ వార్తలపై పూనమ్ పాండే స్వయంగా స్పందించారు. తాను బతికే ఉన్నానని, చనిపోలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి తాను ఇలా చేసినట్లు పూనమ్ పాండే తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది.
పూనమ్ పాండే మరణించినట్లు శుక్రవారం వచ్చిన వార్తలను చాలా మంది నమ్మలేకపోయారు. సినీ పరిశ్రమ కూడా ఈ వార్తను జీర్జించుకోలేకపోయింది.
అయితే శనివారం ఆ వార్తన్నీ అబద్ధం అంటూ స్వయంగా పూనమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూనమ్ పాండే పోస్టు
Actress Poonam Pandey is alive, issues video on Instagram claiming ‘awareness’ for Cervical Cancer pic.twitter.com/ImopsEx0H1
— ANI (@ANI) February 3, 2024