LOADING...
Drishyam 3: జార్జికుట్టి తిరిగి వచ్చాడు.. 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్ విడుదల..

Drishyam 3: జార్జికుట్టి తిరిగి వచ్చాడు.. 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్ విడుదల..

వ్రాసిన వారు Sirish Praharaju
May 11, 2026
10:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న 'దృశ్యం' ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ కథ ఇప్పటికే పలు భాషల్లో పునర్నిర్మాణమై ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. మలయాళంలో నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి రెండు భాగాలు ఘన విజయం సాధించగా,ఇప్పుడు మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో హీరో వెంకటేష్ నటించిన 'దృశ్యం' కూడా రెండు భాగాలుగా విడుదలై మంచి స్పందన అందుకుంది. అయితే మూడో భాగం తెలుగులో రీమేక్‌కు అవుతుందా లేదా అనే చర్చలకు తాజాగా ముగింపు లభించింది. ఈసారి రీమేక్‌కి వెళ్లకుండా,మలయాళంలో రూపొందిన 'దృశ్యం 3'నే తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

వివరాలు 

4 బాషలలో ఈ నెల 21న సినిమా విడుదల

ఈ చిత్రంలో కథానాయకుడి పేరును మార్చకుండా మలయాళంలో ఉన్న 'జార్జికుట్టి' పాత్ర పేరునే కొనసాగించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు యూ/ఏ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలుగా నిర్ణయించారు.

వివరాలు 

హిందీలో 'దృశ్యం 3' రీమేక్

ఇదిలా ఉండగా, హిందీలో కూడా 'దృశ్యం 3' రీమేక్ జరుగుతోంది. నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదలకు సిద్ధమవుతోంది. హిందీ 'దృశ్యం 3' కోసం కొత్త కథ సిద్ధం చేస్తున్నారనే ప్రచారాన్ని దర్శకుడుజీతు జోసెఫ్ ఇప్పటికే ఖండించారు. తాను రచించిన అసలు కథ ఆధారంగానే హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్కంఠను రెట్టింపు చేసిన 'దృశ్యం 3' తెలుగు ట్రైలర్

Advertisement