LOADING...
Mohan Lal : ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!

Mohan Lal : ఆ కేసులో మోహన్ లాల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆందోళనలో ఫ్యాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 25, 2025
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను చాలా కాలం నుంచి ఏనుగు దంతాల కేసు వేధిస్తున్న విషయం తెలిసిందే. 2012లో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు దొరికాయి. ఃపోలీసులు వన్యప్రాణుల చట్టానికి విరుద్ధంగా అలంకారం కోసం మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలను ఉంచారని కేసు నమోదు చేశారు. అయితే మోహన్ లాల్ అప్పట్లోనే ప్రభుత్వ అనుమతితో ఆ ఏనుగు దంతాలను ఇంట్లో ఉంచుకున్నట్టు వివరించారు. ప్రభుత్వ పర్మిషన్‌కు సంబంధించిన పేపర్లను కూడా ఆయన చూపించారు.

Details

పర్మిషన్ లెటర్ రద్దు

ప్రభుత్వం కూడా మోహన్ లాల్‌కు తాము అనుమతిని ఇచ్చినట్లు తెలిపారు. ఆయన చనిపోయిన ఏనుగు దంతాలను మాత్రమే ఇంట్లో ఉంచారని ప్రభుత్వం స్పష్టపరిచింది. అయితే, ఈ కేసు అప్పటి నుంచి కోర్టులో కొనసాగుతోంది. తాజాగా, కోర్టులో విచారణలో ధర్మాసనం ,ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ లెటర్‌ను రద్దు చేసింది. 'ఎవరి ఇష్టానుసారంగానూ పర్మిషన్ ఇవ్వడం ఎలా?" అని కోర్టు ప్రశ్నించింది. చట్టాలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇవ్వడం ఏంటని కోర్టు తప్పు పట్టింది. అంతేకాక మోహన్ లాల్ తనపై కేసును తొలగించమని కోర్టుకు పెట్టిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఈ పరిణామాల కారణంగా ఈ కేసులో తదుపరి దశలో ఏం జరుగుతుందో మోహన్ లాల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.