Loading...
Mokshagna: సింబాగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ఆశీస్సులతో మాస్‌ బొనాంజా!
సింబాగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ఆశీస్సులతో మాస్‌ బొనాంజా!

Mokshagna: సింబాగా మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ఆశీస్సులతో మాస్‌ బొనాంజా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. మోక్షజ్ఞ పుట్టినరోజును సందర్భంగా చేసుకుని ఆయన డెబ్యూ చిత్రాన్ని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. "గుహలోంచి బయటకొచ్చిన కూన.. ఇప్పుడు అడవిలోకి సింహంగా అడుగుపెడుతోంది" (The CUB has left the den. Now, enters the wild as a LION) అంటూ ఇచ్చిన పవర్‌ఫుల్‌ క్యాప్షన్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌' బాలకృష్ణ ఆశీస్సులతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధమైంది. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ

'బింబిసార' వంటి బ్లాక్‌బస్టర్‌ సోషియో ఫాంటసీ చిత్రాన్ని రూపొందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు వశిష్ట.. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

భారీ విజువల్స్‌, కొత్త తరహా కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో వశిష్టకు ఉన్న ప్రత్యేకత ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.

అధికారిక ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఫొటోలో బాలకృష్ణ, మోక్షజ్ఞ, దర్శకుడు వశిష్ట చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతతో కలిసి బాలయ్య, మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు ఈ ఫొటో స్పష్టం చేస్తోంది.

వివరాలు

'మోక్షజ్ఞ × మైత్రీ × వశిష్ట'.. భారీ కాంబినేషన్

'మోక్షజ్ఞ × మైత్రీ × వశిష్ట' అనే ఆసక్తికర కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని (BEGINS SOON) చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

ఒకవైపు భారీ స్థాయి విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు వశిష్ట.. మరోవైపు నిర్మాణ విలువల్లో రాజీపడని మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ ప్రాజెక్ట్‌కు జత కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడనే దానిపై అభిమానుల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.

మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న ఈ భారీ చిత్రం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT