బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు టెలివిజన్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ షో పాపులారిటీయే వేరు. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది.
ఆల్రెడీ నాగార్జునతో ప్రోమోను కూడా రిలీజ్ చేసారు. ఈసారి బిగ్ బాస్ షోని మరింత ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 లోకి కంటెస్టెంట్లుగా నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత రానున్నారని టాక్.
నటిగా సురేఖావాణి చాలా సినిమాలు చేసింది. అలాగే సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ కన్ఫామ్ అయిపోయినట్టేనని వినిపిస్తోంది.
Details
హౌస్ లోకి వస్తున్న భార్యాభర్తలు?
అంతేకాదు, అప్పట్లో గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ ట్రా, అంజలి ఐ లవ్ యూ, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి చిత్రాల్లో నటించిన సంతోష్ పవన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారట.
అయితే పవన్ సంతోష్, తన భార్య అంజలి ఒత్తేటితో కలిసి హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని అంటున్నారు. వీరిద్దరికీ 2015లో వివాహం జరిగింది. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను టచ్ లో ఉన్నారు.
అలాగే ఈ జంట ఇన్స్ టా గ్రామ్ అకౌంట్ కి 15లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
మొత్తానికి ఈసారి బిగ్ బాస్ సీజన్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 7 మొదలవుతుందని టాక్.