Monalisa: 'నన్ను తాకి వేధించాడు'… కన్నీళ్లతో మోనాలిసా షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్న కుంభమేళా ఫేమ్ మోనాలిసా ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఆమె చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కుంభమేళా సమయంలో తీసిన ఫోటోలతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా గుర్తింపు పొందిన మోనాలిసా. తాజాగా దర్శకుడు సనోజ్ మిశ్రాపై ఘాటైన ఆరోపణలు చేశారు. కొచ్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన అనుభవాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో సనోజ్ మిశ్రా తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, పలుమార్లు అనుచితంగా తాకుతూ వేధించారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
వివరాలు
ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయా..
ఈ ఘటన తర్వాత తాను ఇంట్లో వారితో చెప్పినా, అది తన మొదటి సినిమా కావడంతో "ఇలాంటి విషయాలు జరిగిపోతుంటాయి, సర్దుకుపోవాలి" అంటూ కుటుంబ సభ్యులు పెద్దగా స్పందించలేదని ఆమె బాధ వ్యక్తం చేశారు. అప్పటికి తన వయసు 18 ఏళ్లకు కూడా తక్కువగా ఉండటంతో, ఈ విషయాన్ని బయట పెట్టే ధైర్యం చేయలేక మౌనంగా ఉండిపోయానని ఆమె తెలిపారు. ఈ ప్రెస్ మీట్‌కు మోనాలిసా తన భర్త ఫర్మాన్ ఖాన్‌తో కలిసి హాజరయ్యారు. వీరి వివాహం ఇటీవల కేరళలో జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కేరళలోనే నివసిస్తున్నారని, అయితే తమ స్వగ్రామానికి వెళ్లాలనుకున్నా అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని భావిస్తూ భయంతో జీవిస్తున్నామని వెల్లడించారు.