Mr Bachchan : బాలీవుడ్ సినిమా రీమేక్‌లో మాస్ మహారాజా.. రవితేజ, హరీష్ శంకర్ జోడి అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కనుంది.
ఈ మేరకు గతంలోనే హరీష్ శంకర్, రవితేజతో ఓ బాలీవుడ్ సినిమాని రీమేక్ చేయనున్నాడని ప్రచారం జరిగింది.
పవన్ కళ్యాణ్'తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అవుతుండటం కారణంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ సినిమా పక్కన పెట్టేసి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాను అనౌన్స్ చేసేశారు.
ఈ సినిమాలో భాగ్యశ్రీ అనే బాలీవుడ్ భామ హీరోయిన్'గా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది.
ఆదివారం సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.త్వరలోనే షూటింగ్'కి సైతం వెళ్లనుంది. అయితే ఈ సినిమా రీమేక్ కానుండటం గమనార్హం.
Details
మరో రీమేక్ హిట్ రేసులో డైైరెక్టర్ హరీష్ శంకర్
బాలీవుడ్'లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన రైడ్ సినిమాకు రీమేక్'గా అలరించనుంది.
1980 దశకాల్లో జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా 2018లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.
ఇదే సమయంలో బాలీవుడ్'లో రైడ్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు హరీష్ శంకర్ మార్క్ కమర్షియల్ అంశాలు జోడించి 1980 కథలా తీయనున్నట్లు సమాచారం.
గతంలో హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలు రీమేక్ మూవీలే కావడంతో తాజాగా అంచానలు భారీగా ఏర్పడ్డాయి.
తాజాగా మాస్ మహారాజ రవితేజతో మరో రీమేక్ తీసి హిట్ కొట్టేందుకు డైరెక్టర్ ఉవ్విళ్లూరుతున్నాడు.