LOADING...
Dacoit: మృణాల్ 'డెకాయిట్' షూటింగ్ పూర్తి: ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
మృణాల్ 'డెకాయిట్' షూటింగ్ పూర్తి: ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Dacoit: మృణాల్ 'డెకాయిట్' షూటింగ్ పూర్తి: ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ప్రత్యేక కథల కంటెంట్‌పై దృష్టి సారించే హీరోగా గుర్తింపు పొందిన అడివి శేష్, ఈ రోజుల్లో తన కెరీర్‌లో మరో కీలక దశను ఎదుర్కొంటున్నాడు. విభిన్న కథలతో వరుస విజయాలను అందుకుంటూ, ప్రేక్షకుల చూపుని ఆకర్షిస్తున్న శేష్, ఇప్పుడు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న తాజా చిత్రం 'డెకాయిట్' ద్వారా మరోసారి హైప్ క్రియేట్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ అభిమానులలో ఆసక్తిని మరింత పెంచుతోంది. కథానాయికగా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ తన షెడ్యూల్‌లోని షూటింగ్ పూర్తిచేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్స్‌లో తీసిన కొన్ని ప్రత్యేక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. టీమ్ సభ్యులందరు ఒకచోట ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు

అడివి శేష్ - మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇద్దరూ నటనలో అనుభవజ్ఞులైనందున,సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు బలంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ హై వోల్టేజ్ డ్రామాకు సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తి అయింది. మృణాల్ షూటింగ్ ముగించడంతో,ఇకపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగనుండబోతున్నాయి. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్, ఈ సినిమాలో తన పాత్ర ఎలా కనిపిస్తుందో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆమె పాత్ర కథలో కీలక మలుపులు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఇక 'డెకాయిట్' రిలీజ్ డేట్ కూడా వెల్లడైంది.ఈ సినిమా 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

వివరాలు 

రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా డెకాయిట్

ఉగాది పండుగ సమయానికి థియేటర్లలోకి రానుండగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రదర్శన కాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి. అడివి శేష్ ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త తరహా కథను ఎంచుకున్నారు. 'డెకాయిట్' ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. శేష్ లుక్, ప్రెజెంటేషన్ అన్ని కొత్తగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అలాగే, అనురాగ్ కశ్యప్, కమలక్ష్మి భాస్కర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించడం సినిమాకు అదనపు బలాన్ని ఇస్తోంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

Advertisement