LOADING...
Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ

Mrunal Thakur : సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'సీతారామం' భామ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి సినీప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన ముచ్చటైన అందం, మనోహరమైన అభినయంతో ఆమె ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. 2018లో 'లవ్ సోనియా' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ, తర్వాత 'తుఫాన్', 'ధమాకా', 'జెర్సీ' వంటి చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపును పొందింది. ఇదే సమయంలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన టాలీవుడ్ మూవీ 'సీతారామం'తో తెలుగుతెరపై అడుగుపెట్టి, సీతా పాత్రలో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆమె వింటేజ్ లుక్, ఆకట్టుకునే నటన తెలుగు ఆడియెన్స్‌ను మాయ చేసింది. ఇటీవల మృణాల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

మోస్ట్ పాపులర్ యాక్టర్ గా 'మృణాల్'

నెట్టింట 'మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్'గా నిలిచింది మన 'సీత'. సోషల్ మీడియా వేదికలపై ఆమె గురించే ఎక్కువగా చర్చ జరుగుతోందట. ఇందుకు ప్రధాన కారణం ఆమె తరచూ పోస్ట్ చేసే ఫొటోలు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో నిత్యం కొత్త ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది మృణాల్. గ్లామరస్ లుక్, స్టైలిష్ ఫోజులు, స్పైసీ క్లిక్స్‌తో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అంతేకాదు, ఆమె ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవే కారణాల వల్ల మృణాల్ పోస్టులు తరచూ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈక్రమంలో, ఆమెకు ఇప్పుడు 'నెట్టింట మోస్ట్ పాపులర్ నటి' అనే అరుదైన గౌరవం దక్కింది.