
Mrunal Thakur: పాత వీడియో వివాదంపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. బిపాసా వ్యాఖ్యలపై క్షమాపణ!
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వైరల్‌గా మారిన తన పాత వీడియోపై నటి మృణాల్ ఠాకూర్ చివరికి స్పందించారు. ఆ వీడియోలో బిపాసా బసును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీయడంతో, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి వివరణ ఇచ్చారు. తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ కామెంట్స్ చేసినట్లు మృణాల్ తెలిపారు."19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను. అందంపై సరదాగా చేసిన ఆ వ్యాఖ్యలు ఇంతమందిని బాధిస్తాయని అప్పట్లో అర్థం కాలేదు. అలా మాట్లాడినందుకు నిజంగా చింతిస్తున్నాను. ఎవరినీ అవమానించే ఉద్దేశం నాకు లేదు. అది ఎన్నోఏళ్ల క్రితం సరదాగా సాగిన ఓ ఇంటర్వ్యూ మాత్రమే. ఇంత పెద్ద స్థాయికి వెళ్లిపోతుందని ఊహించలేదు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఇప్పుడు భావిస్తున్నాను.
Details
మృణాల్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సెలబ్రేటీలు
మనసుతో చూస్తే ప్రతిదానిలోనూ సౌందర్యం ఉంటుందని మృణాల్ రాసుకొచ్చారు. ఈ వివాదానికి కారణం ఏమిటంటే — గతంలో ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్, తాను బిపాసా బసు కంటే చాలా అందంగా ఉంటానని, ఆమె కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. తాను ఆమెతో పోలిస్తే ఎన్నో రెట్లు అందగత్తెనని అన్నారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో బాలీవుడ్‌లో పలువురు సెలబ్రిటీలు మృణాల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బిపాసా బసు కూడా పరోక్షంగా స్పందిస్తూ, మహిళలంతా బలంగా, దృఢంగా ఉండాలని, అప్పుడే వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించకూడదనే పాత ఆలోచనల నుంచి బయటపడాలని సూచించారు.