LOADING...
Mrunal Thakur : మృణాల్‌ ఠాకూర్‌ కొత్త లవ్‌ స్టోరీ.. 'దో దీవానే సెహర్‌ మే'పై అంచనాలు!
మృణాల్‌ ఠాకూర్‌ కొత్త లవ్‌ స్టోరీ.. 'దో దీవానే సెహర్‌ మే'పై అంచనాలు!

Mrunal Thakur : మృణాల్‌ ఠాకూర్‌ కొత్త లవ్‌ స్టోరీ.. 'దో దీవానే సెహర్‌ మే'పై అంచనాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన మృణాల్‌ ఠాకూర్‌, తాను ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా ఆమె మరో రొమాంటిక్‌ అవతార్‌లో కనిపించేందుకు సిద్ధమవుతోందన్న సమాచారం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో బాలీవుడ్‌ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది‌తో కలిసి ఓ అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రానికి 'దో దీవానే సెహర్‌ మే' అనే టైటిల్‌ ఖరారైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాను ప్రముఖ దర్శక-నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మిస్తుండటం వల్ల సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది.

Details

వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రిలీజ్

ఈ చిత్రానికి రవి ఉద్యవార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మృణాల్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను అభిమానులతో పంచుకుంది. వాటితో పాటు 'శశాంక్‌, రోస్ని (సినిమాలోని పాత్రల పేర్లు)తో కలిసి మీరు కూడా ప్రేమలో పడతారా?' అనే క్యాప్షన్‌ను జోడిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. విడుదలైన పోస్టర్లు సినిమా కథపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో మృణాల్‌ పోషిస్తున్న పాత్ర ఆమె ఇప్పటివరకు చేసిన పాత్రలకంటే భిన్నంగా ఉండబోతుందని టాక్‌. ప్రేమ కథలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంజయ్‌ లీలా భన్సాలీ బ్యానర్‌ నుంచి వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement