NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అర్థరాత్రి తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్: ఆకాశానికెత్తేస్తున్న అభిమానులు 
    తదుపరి వార్తా కథనం
    అర్థరాత్రి తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్: ఆకాశానికెత్తేస్తున్న అభిమానులు 
    తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్

    అర్థరాత్రి తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్: ఆకాశానికెత్తేస్తున్న అభిమానులు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 13, 2023
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తమకు నచ్చిన నటీనటులను ఎంతగా ఆరాధిస్తారో కూడా అందరికీ తెలుసు.

    అలా తెలుగు ప్రేక్షకుల ఆరాధనను సొంతం చేసుకున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు.

    సీతారామం సినిమాలో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్, తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

    అప్పటినుండి ఆమెకు తెలుగులో అభిమానులు పెరిగిపోయారు. బాలీవుడ్ లో సినిమాలు చేసినా కూడా రాని పేరు సీతారామం సినిమాతో తెలుగులో వచ్చేసింది.

    సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ కి తెలుగులో అవకాశాలు బాగా వస్తున్నాయి. అయితే ఆ సినిమాల్లో నటించడం కోసం ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగు నేర్చుకుంటుంది.

    Details

    రాత్రిపూట తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్ 

    ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తున్న మృణాల్ ఠాకూర్, తెలుగు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించింది.

    రాత్రిపూట లాప్ టాప్ ముందు కూర్చుని ఆన్ లైన్ క్లాసుల ద్వారా తెలుగు నేర్చుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒకానొక వీడియోను పోస్ట్ చేసింది.

    ఈ వీడియోలో తాను తెలుగు నేర్చుకుంటే తప్పొప్పులను ఆన్ లైన్ లోని వ్యక్తి సరిదిద్దుతున్నారు. తెలుగు నేర్చుకోవడం పట్ల మృణాల్ ఠాకూర్ చూపుతున్న అంకితభావాన్ని ఆమె అభిమానులు అందరూ మెచ్చుకుంటున్నారు.

    తెలుగు సినిమాల్లో నటించే మిగతా హీరోయిన్లు కూడా మృణాల్ ఠాకూర్ లాగా తెలుగు నేర్చుకుంటే ఎంత బాగుంటుందోనని కామెంట్స్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తెలుగు నేర్చుకుంటున్న మృణాల్ ఠాకూర్ ట్వీట్ 

    😻💌🌅#MrunalThakur pic.twitter.com/zYujE6nysF

    — Mrunal Thakur (@actressmrunal) September 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మృణాల్ ఠాకూర్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు

    మృణాల్ ఠాకూర్

    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న
    IIFM Awards 2023: : సీతారామం చిత్రానికి అవార్డు; మృణాల్ ఠాకూర్‌కు ప్రత్యేక పురస్కారం  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?  రజనీకాంత్
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా?  జవాన్
    అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్  అల్లు అర్జున్

    సినిమా

    ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు  ఖుషి
    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్  సలార్
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  గోపీచంద్
    ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025