LOADING...
Agadha: 'అగధ' పోస్టర్ రిలీజ్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ
'అగధ' పోస్టర్ రిలీజ్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ

Agadha: 'అగధ' పోస్టర్ రిలీజ్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్రసీమలో ఎన్నో ట్రెండ్‌ను సృష్టించిన సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు ఎం.ఎస్. రాజు, గత కొంతకాలంగా భిన్నమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'అగధ' ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ చిత్రాన్ని 'మిస్టికల్ డివైన్ థ్రిల్లర్'గా పరిచయం చేస్తున్నారు.

వివరాలు

45 నిమిషాల పాటు వీఎఫ్ఎక్స్ సీన్స్..

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా అత్యంత వైభవంగా ఉండనుందని సమాచారం. దాదాపు 85 రోజుల పాటు విభిన్న సెట్స్, లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ముఖ్యంగా, సుమారు 45 నిమిషాల పాటు వీఎఫ్ఎక్స్ (VFX) సన్నివేశాలు ఉండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వివరాలు

మిస్టరీ, దైవత్వం మేళవించిన కథ..

మిస్టరీ, దైవత్వం మేళవించిన కథ కావడంతో, విజువల్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఎం.ఎస్. రాజు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో పోస్టర్‌ను పరిశీలిస్తే, 12 చేతులు కలిగిన భారీ విగ్రహం ముందు ఒక యువతి నిలబడిన దృశ్యం కనిపిస్తుంది. ఇది సినిమాలో ఏదో గూఢార్థం, తెలియని రహస్యం దాగి ఉందనే ఆసక్తిని కలిగిస్తోంది.

Advertisement

వివరాలు

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్..

కాశీ విశాలాక్షి బాలుసు 'శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని మిక్కిన్ అరుల్ దేవ్ సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించిన నటీనటుల వివరాలను ప్రస్తుతం రహస్యంగా ఉంచారు. త్వరలోనే ఆ వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement