Page Loader
Mufasa Collections: ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ముఫాసా
ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ముఫాసా

Mufasa Collections: ఫ‌స్ట్ వీక్‌లో 74 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించిన ముఫాసా

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్‌ బాబు వాయిస్ ఓవర్ అందించిన "ముఫాసా: ది లయన్ కింగ్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే ఇండియా వ్యాప్తంగా 74 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసిందని మేకర్స్ వెల్లడించారు. తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు వాయిస్‌ అందించగా, బ్రహ్మానందం, సత్యదేవ్, అలీ వంటి ఇతర ప్రముఖులు కూడా గళాన్ని వినిపించారు. షారుఖ్‌ఖాన్‌.. హిందీ వెర్షన్‌కు షారుఖ్‌ఖాన్ తో పాటు ఆయన కుమారులు ఆర్యన్, అబ్రామ్ డబ్బింగ్ చెప్పారు. మహేష్‌బాబు, షారుఖ్‌ఖాన్ వంటి స్టార్ హీరోల క్రేజ్ "ముఫాసా" సినిమాకు బాగా కలిసివచ్చింది. ఈ కారణంగా తెలుగు, హిందీ భాషల్లో సినిమా భారీ వసూళ్లు సాధించింది.

వివరాలు 

ఇతర సినిమాలపై ఆధిపత్యం

గత వారం విడుదలైన ఉపేంద్ర "యూఐ"చిత్రం, విజయ్ సేతుపతి "విడుదల 2" సినిమాలతో పోలిస్తే "ముఫాసా" ఎక్కువ కలెక్షన్లు సాధించడం విశేషం. "యూఐ" చిత్రం ఫస్ట్ వీక్‌లో 36 కోట్ల వసూళ్లు రాబట్టగా,"విడుదల 2" 31 కోట్ల వరకూ వసూళ్లు అందుకుంది. ముఫాసా కథ వ‌ర‌ద‌ల కార‌ణంగా తల్లిదండ్రుల నుండి దూరమైన ముఫాసా,టాకా వద్ద ఆశ్రయం పొందుతుంది. తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి చేరాలని ఆరాటపడే ముఫాసా, ఓ దాడిలో తెల్ల సింహాల యువరాజును చంపుతుంది. దీని ఫలితంగా తెల్ల సింహాలు ముఫాసాపై ప్రతీకారాన్ని పెంచుకుంటాయి. వారి నాయకుడు కిరోస్ ముఫాసా రాజ్యంపై దండెత్తుతాడు.ఈ పరిస్థితుల్లో ముఫాసా తల్లిదండ్రులను కలుసుకుందా? కిరోస్ దండయాత్రను ఎలా ఎదుర్కొంది?అనే అంశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వివరాలు 

వ‌ర‌ల్డ్ వైడ్‌గా మిక్స్‌డ్ టాక్‌... 

ఇండియాలో విజయవంతంగా కొనసాగుతున్న "ముఫాసా", విదేశాలలో మాత్రం మిశ్రమ స్పందనను పొందింది. దాదాపు 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 198 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించింది. సీక్వెల్ వివరాలు 2019లో విడుదలైన "ది లయన్ కింగ్" చిత్రానికి సీక్వెల్‌గా "ముఫాసా" రూపొందింది. "ది లయన్ కింగ్" హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 1657 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.