LOADING...
The Raja Saab : 'రాజా సాబ్' సెకండ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్?.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!
'రాజా సాబ్' సెకండ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్?.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

The Raja Saab : 'రాజా సాబ్' సెకండ్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్?.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్‌-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ది రాజా సాబ్' ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ మూవీ 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని నెలల క్రితం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు మరో ట్రైలర్ రానున్నట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా రిలీజ్ ట్రైలర్‌ను లాంచ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న జరగనుండగా, వేదికగా హైదరాబాద్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.

Details

కథానాయికలుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వీ టీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Advertisement