Vipin Reshammiya: హిమేష్ రేష్మియా ఇంట విషాదం... తండ్రి కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని తండ్రి, ప్రముఖ సంగీతకారుడు విపిన్ రేష్మియా, 87 సంవత్సరాల వయస్సులో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 18న రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆయన అర్థరాత్రి మరణించారు. అయన అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ముంబైలో నిర్వహిస్తారు.
టెలివిజన్ సీరియల్ నిర్మాతగా విపిన్ రేష్మియా
విపిన్ రేష్మియా సంగీత దర్శకత్వానికి మళ్లడానికి ముందు , టెలివిజన్ సీరియల్ నిర్మాతగా తన ప్రత్యేకతను చూపించారు. ఆయన "తేరా సురూర్", "ది ఎక్స్‌పోజ్", "ఇన్సాఫ్ కి జంగ్" చిత్రాలకు నిర్మాతగా పనిచేశారు. అయన కుమారుడు హిమేష్ రేష్మియా ఈ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించారు. విపిన్ రేష్మియా "ఇన్సాఫ్ కా సూరజ్" అనే చిత్రానికి సంగీతం అందించారు, కానీ అది ఇప్పటివరకు విడుదల కాలేదు. 2021లో, హిమేష్ "ఇండియన్ ఐడల్" సెట్స్‌లో తన తండ్రి అద్భుతమైన పాటను కంపోజ్ చేశారని, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ కలిసి పాడారని తెలిపారు, అయితే ఈ పాట కూడా విడుదల కాలేదు.