Page Loader
Renu Desai: పిల్లలే ధైర్యం చెప్పారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటా : రేణు దేశాయ్
పిల్లలే ధైర్యం చెప్పారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటా : రేణు దేశాయ్

Renu Desai: పిల్లలే ధైర్యం చెప్పారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటా : రేణు దేశాయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా మాత్రమే కాకుండా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్‌... తల్లిగా తన జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె రెండో పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులు, నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తన రెండో వివాహంపై స్పష్టత ఇచ్చిన రేణూ వ్యాఖ్యలు ఇప్పుడు వైరలయ్యాయి. ఇంకొన్ని సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్ చెప్పారు. ఇప్పటివరకు పిల్లల కోసమే పెళ్లి చేసుకోలేదు. .

Details

నెటిజన్ల మద్దతు

వాళ్లు చిన్న వయసులో ఉండగా నేను మరో పెళ్లి చేసుకుంటే వాళ్లకు ఒంటరితనంగా అనిపిస్తుందేమోనని అనిపించింది. మమ్మీ, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వారినే పెళ్లి చేసుకో అని అకీరా, ఆధ్య తనకు చెప్పడం తనకు బలాన్ని ఇచ్చిందన్నారు. అలాగే వాళ్లు త్వరలో కాలేజీలో అడుగు పెడతారు. అప్పుడు వాళ్ల జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. వాళ్లు నన్ను అంతగా ఆధారపడే దశ దాటిపోతారు. అప్పుడు నేనూ నా జీవితం కొత్తగా ప్రారంభించవచ్చు అని పేర్కొన్నారు ఆమె నిర్ణయంపై చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు