Page Loader
Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవితో నా కల నిజమైంది.. శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవితో నా కల నిజమైంది.. శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు

Srikanth Odela: మెగాస్టార్ చిరంజీవితో నా కల నిజమైంది.. శ్రీకాంత్ ఓదెల ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. చిన్నతనంలోనే చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయనతో పనిచేస్తున్నానంటే నిజమేనా అనిపిస్తోందన్నారు. ఈ చిత్రం చిరంజీవి మునుపటి చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. స్క్రిప్ట్‌ను 48 గంటల్లోనే ఫైనల్ చేశామని, ఆయన సెట్‌లో అడుగు పెట్టిన వెంటనే నిబద్ధత పనిచేస్తారన్నారు.

Details

'ది ప్యారడైజ్‌' పూర్తియైన వెంటనే చిరుతో మూవీ

అనంతరం తన మొదటి చిత్రం 'దసరా' గురించి మాట్లాడారు. ఈ కథకు తన తండ్రే స్ఫూర్తి అని చిన్నతనంలో తన తండ్రి బొగ్గు గనుల్లో పని చేసేవారని, ఆయనను చూస్తూ ఈ కథ రాశానని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ ప్రస్తుతం నాని నిర్మాణంలో 'ది ప్యారడైజ్‌' పేరుతో తన రెండో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయ్యిన తర్వాత చిరంజీవితో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. చిరు-శ్రీకాంత్ కాంబినేషన్ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి సినీప్రియుల్లో నెలకొంది.