Ajith: మా నాన్న జీవించి ఉంటే గర్వపడేవాడు.. పద్మ అవార్డుపై అజిత్ భావోద్వేగం
ఈ వార్తాకథనం ఏంటి
సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గానూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
ఈ ఘనతపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అజిత్ భావోద్వేగాలతో కూడిన ఒక సందేశాన్ని పంచుకున్నారు. పద్మభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేయడం నిజంగా ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు.
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలని చెప్పారు.
ఈ పురస్కారం వ్యక్తిగత విజయానికి మాత్రమే కాకుండా, ఎంతో మంది కలసికట్టుగా చేసిన కృషికి, మద్దతుకు చిహ్నమన్నారు.
సినీ పరిశ్రమలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని అజిత్ వెల్లడించారు.
Details
సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ఇంతకాలం రేసింగ్, షూటింగ్ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని, ఈ రోజును చూడటానికి తన తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేదన్నారు.
భౌతికంగా ఆయన మా మధ్య లేకున్నా, తన జీవితంలో ఆయన ప్రభావం నేటికీ ఉందన్నారు. గత 25 సంవత్సరాలుగా నా భార్య షాలిని నిరంతరం మద్దతుగా నిలిచిందన్నారు.
తన విజయానికి ఆమే ప్రధాన కారణమన్నారు. ప్రేమ, మద్దతు వల్లే నేను మరింత అంకితభావంతో పనిచేయగలుగుతున్నానని చెప్పారు.
ఈ అవార్డు మీ అందరికీ అంకితమని, ఇంకా వినోదాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ కష్టపడతానని అజిత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.