Keerthy Suresh: నా భర్త నన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు: కీర్తి సురేష్
ఈ వార్తాకథనం ఏంటి
తన భర్త ఆంటోనీ తటిల్‌కు సినిమా ప్రచారాలు, సినీ రంగానికి సంబంధించిన హడావుడి ఇష్టం ఉండదని నటి కీర్తి సురేష్ తెలిపారు. 'సత్యవాన్ సావిత్రి' సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన రూమర్స్‌తో పాటు భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వివరాలు
రూమర్స్ నన్ను బాధించేవి
ఇండస్ట్రీలోని నటులతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వదంతులు గతంలో తనను బాధించేవని కీర్తి చెప్పారు.
ఇండస్ట్రీలో నటులతో నాకు బంధం ఉందంటూ వచ్చే రూమర్స్ నన్ను ఇబ్బంది పెట్టేవి. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒకే ఒక్క రిలేషన్‌లో ఉన్నాను.
అది కూడా ఆంటోనీతోనే. 'దీనిపై నేను ఏదైనా స్పందించాలా?' అని ఆంటోనీ నన్ను అడిగేవాడు. అయితే, అంతకుమించి ఆయన ఎప్పుడూ నన్ను ఏమీ ప్రశ్నించలేదు.
మా ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు, నేను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ వదంతులను పట్టించుకోనని స్పష్టం చేశారు.
వివరాలు
నా కెరీర్‌కు ఆంటోనీ ఎంతో మద్దతు
తన భర్త ఆంటోనీ చాలా మంచి వ్యక్తి అని కీర్తి తెలిపారు. తన కెరీర్‌కు ఆయన ఎంతో మద్దతుగా నిలుస్తారని చెప్పారు.
తాను నిరాశలో ఉన్నప్పుడు ఆంటోనీయే ధైర్యం చెబుతారని, ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తారని వెల్లడించారు.
అయితే ఆంటోనీకి సినిమా రంగానికి సంబంధించిన హడావుడి, ప్రచార కార్యక్రమాలు ఇష్టం ఉండవని కీర్తి తెలిపారు. అందుకే ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టకూడదని భావిస్తానన్నారు.
తాను సినిమా ప్రీమియర్‌కు వెళ్లినా ఆయన మాత్రం రారని చెప్పారు. తనకు తోడుగా ఉండటం కంటే ఆయన సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.
కాగా కీర్తి సురేశ్, ఆంటోనీ తటిల్ 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అనంతరం 2024లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.