Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేకపోయా.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించా!
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'డ్యూడ్', 'జన నాయగన్' సినిమాల సక్సెస్‌తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా కేరళలో జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మమితా బైజు మాట్లాడుతూ.. 2015లో సూర్యను కలవాలని తాను ఎంతగానో ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆయనను కలవలేకపోయానని, కానీ ఇప్పుడు అదే హీరోతో కలిసి సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యారు.
వివరాలు
గుర్తుచేసుకున్న ఆ ఘటన..
''2015లో సూర్య సర్ కొచ్చిలోని ఓ మాల్‌లో జరిగిన కార్యక్రమానికి వచ్చారు. అప్పటికి నేను 8వ తరగతి చదువుతున్నాను.
అదే స్కూల్‌లో మా అన్నయ్య 11వ తరగతి చదువుతున్నాడు. సూర్య సర్‌ను చూసేందుకు మా అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చికి వెళ్లాడు.
నేను కూడా ఆయనను కలవాలని చాలా ఆశపడ్డాను. వాళ్లతో పాటు నేనూ వస్తానని అమ్మానాన్నలను అడిగాను.
కానీ, వారు నన్ను వెళ్లనివ్వలేదు. ఆ తర్వాత మా అన్నయ్య సూర్య సర్‌తో కలిసి దిగిన ఫొటోను నాకు చూపించాడు. అది చూసి చాలా నిరాశపడ్డాను.
వివరాలు
తెలుగు, తమిళ భాషల్లో మూవీ..
కానీ ఇప్పుడు అదే సూర్య సర్‌తో కలిసి సినిమాలో నటించాను. ప్రస్తుతం ఆయనతో కలిసి ఇక్కడ నిలబడటం నాకు ఒక గొప్ప వరంలా అనిపిస్తోంది'' అని మమితా బైజు ఎమోషనల్‌గా చెప్పారు.
ఇక 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
సూర్య కథానాయకుడిగా నటిస్తుండగా.. మమితా బైజు హీరోయిన్‌గా కనిపించనున్నారు.
రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.