
Chiranjeevi: వరద బాధితులకు సాయం అందించడం నా బాధ్యత.. చిరంజీవి
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సాయం అందించారు.
చిరంజీవి తన తరపున రూ. 50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షల చెక్కులను చంద్రబాబుకు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చి కోటి రూపాయలు విరాళం అందించారని, వారి సాయం వల్ల నష్టపోయిన జీవితాలను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Details
సహాయక చర్యలు ఆదర్శప్రాయంగా ఉన్నాయి
దీనిపై చిరంజీవి కూడా స్పందించారు. తనపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు అని, తమ ప్రజలకు విపత్తుల సమయంలో సాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
మీ నాయకత్వంలో జరుగుతున్న సహాయక చర్యలు నిజంగా ఆదర్శప్రాయంగా ఉన్నాయని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు తమ వంతు సాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు.