'పెద కాపు 1'లో విభన్నమైన పాత్ర చేశా..కెరీర్‌లోనే గుర్తిండి పోయే పాత్ర: తనికెళ్ల భరణి
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 800 పాత్రలు చేశానని, అందులో 'పెద కాపు 1'లో నటించిన పాత్ర కెరీర్ లోనే గుర్తిండి పోతుందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి పేర్కొన్నారు. ఈ నెల 29న 'పెద కాపు 1' చిత్రం విడుదల సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో చాల వరకూ తండ్రి పాత్రలే చేశానని, కానీ 'పెద కాపు 1'లో చాలా విభిన్నమైన పాత్ర పోషించానని, సమాజంలో విసిగిపోయిన ఓ మేధావి పాత్ర తాను పోషించానని పేర్కొన్నారు. చాలా రోజులు ఈ సినిమా కోసం పని చేశానని, తన కెరీర్ లో నిలిచిపోయే పాత్ర ఇదేనని భరణి వెల్లడించారు.
హీరో విరాట్ కర్ణ అంకిత భావంతో పనిచేశారు : భరణి
దర్శకుడు శ్రీకాంత్ ట్రాన్స్ పర్మేషన్ విభిన్నంగా ఉంటుందని, అయితే హింసను ఓ మోతాదుకు మించి ఇందులో చూపించారని భరణి తెలిపారు. హీరో విరాట్ కర్ణ మొదట్లో కొత్తగా కనిపించాడని, అతనిలో అంకిత భావం, కసి కనిపించాయని, కచ్చితంగా విజయం సాధిస్తాడన్నారు. ఇక నిర్మాత రవీందర్ రెడ్డి 'ఆఖండ చిత్రాన్ని ఎంత భారీగా తీశారో ఈ చిత్రాన్ని అంతే భారీగా నిర్మించారన్నారు. ఈ మధ్య 'సర్కారు నౌకరి', కన్నడలో ప్రభుదేవా, శివరాజ్ కుమార్ కలిసి ఓ సినిమాలో నటించానని ఈ రెండు పాత్రలు నటుడిగా చాలా తృప్తినిచ్చాయని వెల్లడించారు.