Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది.. మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న 'డేవిడ్ రెడ్డి' సినిమా ఇటీవల టీజర్ విడుదలతో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. మంచు కుటుంబ వారసుల్లో ఒకడైన మనోజ్, ఈ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడారు. తన తండ్రి మోహన్ బాబు గురించి చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ రిపోర్టర్, "మీ తండ్రి మోహన్ బాబుతో ఉన్న విభేదాలు సద్దుమణిగాయా?" అని ప్రశ్నించగా.. మనోజ్ తనదైన శైలిలో నవ్విస్తూ సమాధానం ఇచ్చాడు. అది ఎవరిని అడగాలో మీకు తెలుసు కదా.. అక్కడికి వెళ్లి అడగండి. కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా.. మైక్ తీసుకుని మాత్రం వెళ్లకండి.. అలాగే హెల్మెట్ వేసుకుని వెళ్లండంటూ మనోజ్ సరదాగా కామెంట్ చేశాడు.
వివరాలు
హెల్మెట్ పెట్టుకొని వెళ్లండి
దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. గతంలో మంచు కుటుంబ వివాదాల సమయంలో మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంటికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఘటనను ఉద్దేశించే మనోజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ రిపోర్టర్ చేతిలోని మైక్‌ను తీసుకుని అతని తలపై కొట్టడంతో గాయాలు కావడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పుడు అదే విషయాన్ని మనోజ్ హాస్యంగా ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రాజకీయాలపై కూడా మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయాల్లోకి వస్తారా?" అని అడగగా.. "రాజకీయాల్లోకి కొత్తగా రావడమేంటి అన్నా.. పుట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నామని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.
వివరాలు
మరోసారి నవ్వులు పూయించిన మనోజ్
మరి ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించగా.. జనాల పార్టీలో ఉన్నామని చెప్పి మరోసారి నవ్వులు పూయించాడు. అదే సమయంలో తన భార్య భూమా మౌనికా రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కూడా మనోజ్ వెల్లడించడం గమనార్హం. మరోవైపు ఇటీవలే మనోజ్ 'ఐక్య' పేరుతో ఓ ఫౌండేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని వారి విద్యాభ్యాస బాధ్యతలు కూడా భరిస్తానని ప్రకటించాడు. ఇక మనోజ్ నటిస్తున్న 'డేవిడ్ రెడ్డి' సినిమా టీజర్ రెండు రోజుల క్రితం విడుదలైంది.
వివరాలు
ఇది డేవిడ్ ఇండియా
యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో రూపొందిన ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా చివర్లో మనోజ్ చెప్పిన "ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. డేవిడ్ రెడ్డి ఇండియా" అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.