Rashmika : డూప్ లేకుండా రష్మిక రిస్క్.. 80 అడుగుల ఎత్తు నుంచి జంప్.. 'మైసా' షూటింగ్‌లో గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాలు వచ్చినా వెనుకాడని కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు. తాజాగా మరోసారి ఆమె తన నటనపై ఉన్న అంకితభావాన్ని నిరూపించారు. ప్రస్తుతం నటిస్తున్న 'మైసా' చిత్రం కోసం గతంలో ఎప్పుడూ చేయని స్థాయిలో శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక గోండు తెగకు చెందిన మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సాహసోపేత స్టంట్స్ గురించి దర్శకుడు రవీంద్ర పుల్లె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వివరాలు
ఆమె కోపం, ఆవేశం సినిమాకు ప్రధాన ఆకర్షణ..
''రష్మిక పోషిస్తున్న పాత్ర పేరు 'మైసా'. ఇది ఎంతో ప్రభావశీలమైన పాత్ర. ఆమె చూపించే కోపం, ఆవేశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద ఒక క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించాం. ఆ సన్నివేశంలో రష్మిక ఎలాంటి డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. ఆ సమయంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం అంతా ఆశ్చర్యానికి గురైంది'' అని చెప్పారు.
వివరాలు
ఆ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో రష్మిక
ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో రష్మిక ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని దర్శకుడు తెలిపారు. బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున కఠినమైన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు గిరిజనుల పోరాట విధానాలను సమ్మిళితం చేసి ఈ చిత్రానికి ప్రత్యేకమైన కొత్త యాక్షన్ శైలిని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.