తదుపరి వార్తా కథనం

RAPO22 : మహేష్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా.. అనౌన్స్ చేసిన మైత్రి మూవీ మేకర్స్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 12, 2024
05:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని హీరోగా, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో ఘన విజయం సాధించిన దర్శకుడు మహేష్‌బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
విజయదశమి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. రామ్ పోతినేని కెరీర్‌లో ఇది 22వ చిత్రం కావడం విశేషం.
నవంబర్ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుందని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలిపారు.
Details
త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి
రామ్ పోతినేనితో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ ప్రాజెక్ట్ హై ఎనర్జీతో కూడిన న్యూ ఏజ్ కథనంతో ప్రేక్షకులను అలరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సినిమా కథానాయిక, ఇతర తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు.