
Shivam Bhaje: నైజాంలో 'శివం భజే' చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్
ఈ వార్తాకథనం ఏంటి
ఓంకార్ తమ్ముడిగా అశ్విన్ బాబు టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. 'రాజు గారి గది' చిత్రంతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజాగా అతను నటించిన 'శివం భజే' త్వరలో రిలీజ్ కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అదరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 1న ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను నైజాం ఏరియాలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చింది.
Details
నాగ్ అశ్విన్ సరసన హీరోయిన్ గా దిగంగనా సూర్యవంశీ
అదే విధంగా ఎల్ఎల్‌పి లాంటి పెద్ద సంస్థ నైజాంలో ఏరియాలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
ఈ మధ్య రిలీజైన ట్రైలర్‌లో చూపించినట్లుగా క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట వంటి కొత్త అంశాలను చూపించారు.
నాగ్ అశ్విన్ సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోంది.
హైపర్ ఆది, శకలక శంకర్, బ్రహ్మజీ, మురళీ శర్మ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.