Naa Saami Ranga: ఏపీ,తెలంగాణలో 'నా సామిరంగ' మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామి రంగ'. ఈ చిత్రంతో నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం పరిచయమయ్యారు.
ఈ సంక్రాంతి సీజన్‌లో ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్షకులు,విమర్శకుల నుండి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం: రూ. 1.2 కోట్లు, సిడెడ్: రూ. 85 లక్షలు, గుంటూరు: రూ. 47 లక్షలు, వైజాగ్: రూ. 50 లక్షలు, తూర్పు: రూ. 60 లక్షలు, వెస్ట్: రూ. 30 లక్షలు, కృష్ణా: రూ. 23 లక్షలు, నెల్లూరు: రూ. 18 లక్షలు.
Details
హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న నాగార్జున
ఈ సినిమా టోటల్ షేర్ ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణలలో రూ. 4.33 కోట్లు రాబట్టింది.
రాబోయే రోజుల్లో ట్రేడ్ పండితులు మరింత కలెక్షన్స్ పెరిగేఅవకాశం ఉందంటున్నారు.
దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్, షబీర్ కల్లరక్కల్, రవివర్మ, నాజర్, రావు రమేష్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి.