
ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్.. ఇద్దరురూ కలిసి ఆస్కార్ వేదిక మీద అవార్డును అందుకున్నారు.
భారతీయ సినిమా చరిత్రలో మొదటిసారిగా ఉత్తమ పాట విభాగంలో ఆస్కార్ అందుకున్న వాళ్లుగా ఎంఎం కీరవాణి, చంద్రబోస్ నిలిచిపోయారు.
అయితే ఆస్కార్ అందుకుని భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుండి ఆస్కార్ గ్రహీతలను సన్మానించి సత్కరిస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆస్కార్ గ్రహీతలను సన్మానించింది.
తాజాగా నాటు నాటు పాట రచయిత చంద్రబోస్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రత్యేక పురస్కారంతో గౌరవించింది.
Details
విక్టోరియా పార్లమెంటు భవనంలో పురస్కారం అందుకున్న చంద్రబోస్
మెల్బోర్న్ లోని పార్లమెంట్ ఆఫ్ విక్టోరియా భవనంలో రికగ్నిషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పురస్కారాన్ని చంద్రబోస్ కు అందించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు మిస్టర్ లీ, మిస్టర్ మ్యాట్ పాల్గొన్నారు.
నాటు నాటు పాటలో ప్రాంతీయత ఉట్టిపడుతుందని, అందుకే ఆ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు చంద్రబోస్ పై ప్రశంసలు కురిపించారు.
ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవాన్ని అందుకున్న చంద్రబోస్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
చంద్రబోస్ ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో దాదాపు 5వేలకు పైగా పాటలు రాశారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన పాటలు ఉన్నాయి.