LOADING...
Nag Ashwin: 'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు'.. 'కల్కి' విమర్శలకు నాగ్ అశ్విన్ కౌంటర్
'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు'.. 'కల్కి' విమర్శలకు నాగ్ అశ్విన్ కౌంటర్

Nag Ashwin: 'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు'.. 'కల్కి' విమర్శలకు నాగ్ అశ్విన్ కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో సాధారణంగా ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్, ఈసారి తనపై వస్తున్న విమర్శలకు స్వయంగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా 'కల్కి 2898 AD' సినిమాలో కర్ణుడి పాత్రను చూపించిన తీరు, క్లైమాక్స్ రూపకల్పనపై సోషల్ మీడియాలో వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ఆయన స్పందించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు,'పార్ట్ 2 కోసం వేచి ఉండండి'అంటూ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వివాదానికి కారణం ఇటీవల అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు. ఆ పోస్టులో ప్రమోద్ పంజు నటనను ప్రశంసించిన ఓ నెటిజన్, కర్ణుడి పాత్రను వెండితెరపై ఇలాంటి విధంగానే ఆవిష్కరించాలని అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

చిత్రీకరణకు మహాభారతంలోని ఆధారాలే బలం: నాగ్ అశ్విన్

అదే సమయంలో 'కల్కి 2898 AD'లో కర్ణుడి పాత్రను అతిగా మహిమాపరిచారని ఆరోపిస్తూ,సినిమా క్లైమాక్స్‌ను దైవదూషణగా పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు, విమర్శకుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ విమర్శలను పట్టించుకోకుండా వదిలేయకుండా నాగ్ అశ్విన్ నేరుగా స్పందించడం విశేషం. తన చిత్రీకరణకు మహాభారతంలోని ఆధారాలే బలమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ద్రోణవధ పర్వానికి సంబంధించిన ఒక పేజీని పంచుకుంటూ, శ్రీకృష్ణుడు అర్జునుడితో సంభాషణలో కర్ణుడి గొప్పతనాన్ని ప్రస్తావించిన సందర్భాలను గుర్తు చేశారు.

వివరాలు 

కథపై పూర్తి అవగాహనతోనే ముందుకు: అశ్విన్

మహాభారతాన్ని పూర్తిగా చదవాలని, లేదంటే కనీసం శ్రీకృష్ణుడు కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడో పరిశీలించాలని నాగ్ అశ్విన్ సూచించారు. భారతీయ ఇతిహాసాలపై తనకు అపారమైన గౌరవం ఉందని, వాటి సారాన్ని అర్థం చేసుకున్న తర్వాతే 'కల్కి 2898 AD'ను తెరకెక్కించానని స్పష్టం చేశారు. తాను రూపొందిస్తున్న కథపై పూర్తి అవగాహనతోనే ముందుకు సాగుతున్నానని చెబుతూ, 'నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు' అనే భావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, చివర్లో 'పార్ట్ 2 కోసం వేచి ఉండండి' అని చేసిన వ్యాఖ్యతో మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. దీంతో 'కల్కి 2898 AD పార్ట్ 2'లో కర్ణుడి పాత్ర మరింత కీలకంగా ఉండబోతుందా అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది.

Advertisement

వివరాలు 

నాగ్ అశ్విన్ స్పందనతో మరింత పెరిగిన ఆసక్తి

నాగ్ అశ్విన్ స్పందన తర్వాత మరోసారి మహాభారతంలోని కర్ణుడి పాత్ర, దాని ప్రాధాన్యం,వివిధ వ్యాఖ్యానాలపై నెటిజన్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న 'కల్కి 2898 AD పార్ట్ 2'పై ఈ ఒక్క స్పందనతో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా కర్ణుడి పాత్రను తదుపరి భాగంలో నాగ్ అశ్విన్ ఎలా ఆవిష్కరిస్తారనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ 

Advertisement