Page Loader
 Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం 
నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం

 Naga Chaitanya: నాగచైతన్య, శోభిత పెళ్లి తేదీ ఖరారు.. సంగీత్, మెహందీతో వేడుకలు ప్రారంభం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 30, 2024
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోనున్నారు. సమంతతో విడాకుల అనంతరం, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్లతో జీవితాన్ని పంచుకోనున్నారు. ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం నాగార్జున నివాసంలో సింపుల్‌గా జరిగింది. వీరద్దరు వివాహ బంధంలోకి డిసెంబర్ 4న అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2వ తేదీన సంగీత్ వేడుక, 3వ తేదీన మెహందీ, 4న వివాహం జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే గ్రాండ్ రిసెప్షన్‌ కూడా ఉంటుందని సమాచారం.

Details

హల్దీ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

పెళ్లి తంతును డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరపాలనుకుంటున్నారని, రాజస్థాన్‌లో ఒక రాయల్ వేడుక కోసం వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు పసుపు వేడుకలు వైజాగ్‌లోని శోభిత నివాసంలో సంప్రదాయబద్దంగా జరిగాయి. శోభిత తన కుటుంబ సభ్యులతో కలిసి హల్దీ వేడుక ఫోటోలను సోష‌ల్ మీడియాలో పంచుకోవడం ద్వారా అభిమానులకు ఈ ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా షూటింగ్ లో ఉన్నాడు.