LOADING...
Naga Chaitanya : నాగచైతన్య 'దూత 2'కి గ్రీన్ సిగ్నల్?
నాగచైతన్య 'దూత 2'కి గ్రీన్ సిగ్నల్?

Naga Chaitanya : నాగచైతన్య 'దూత 2'కి గ్రీన్ సిగ్నల్?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ తర్వాత చైతూ ఏ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో,ఆయన నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'దూత'కి సీక్వెల్ రాబోతోందన్న ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజులుగా అభిమానులు 'దూత 2' ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సాగర్ పాత్రలో నాగచైతన్యను మరోసారి అదే ఉత్కంఠభరిత వాతావరణంలో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వివరాలు 

మొదలైన ప్రీ-ప్రొడక్షన్ పనులు

తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్‌కి చైతన్య ఇప్పటికే ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌కు దర్శకుడు విక్రమ్ కె కుమార్ సీక్వెల్ కోసం మరింత ఆసక్తికరమైన కథను రెడీ చేసినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన 'దూత' తొలి భాగం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ సిరీస్‌లో నాగచైతన్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయిని మించి థ్రిల్ అందించేందుకు విక్రమ్ కె కుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన

ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనున్నట్టు తెలుస్తుండటం విశేషం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ సీక్వెల్స్‌లో 'దూత 2' ప్రత్యేకమైన రికార్డులు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement