Naga Chaitanya: నోరూరించే చేపల పులుసు వండిన నటుడు నాగచైతన్య.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం "తండేల్". ఈ చిత్రం, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కితోంది.
ఇందులో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే 'బుజ్జితల్లి కాస్త నవ్వవే', 'నమో నమో నమః శివాయ' అనే రెండు పాటలు విడుదల అయ్యాయి.
ఇదిలా ఉంటే, తండేల్ రాజు పాత్రలో నటిస్తున్న నాగచైతన్య విశాఖపట్నంలో స్థానిక మత్స్యకారులతో కలిసి కొంతసేపు గడిపారు.
వివరాలు
చిత్ర బృందం షేర్ చేసిన వీడియో వైరల్
చిత్ర షూటింగ్ చివరి రోజు, అతడు ఇచ్చిన మాట ప్రకారం, చేపల పులుసు స్వయంగా వండాడు.
స్థానికులతో పాటు చిత్ర బృందానికి కూడా తన వంట రుచి చూపించాడు. ఈ సంఘటనను చిత్ర బృందం ఒక వీడియో ద్వారా పంచింది.
"యేట్లో చేపలు పట్టేసాక మంచి పులుసు చేసుకోవాల్సిందే. తండేల్ రాజా అను యువ సామ్రాట్ నాగచైతన్య, తండేల్ షూటింగ్‌లో స్థానికుల కోసం తన వంటకంపై అభిమానాన్ని చాటాడు" అని వీడియోలో పేర్కొనబడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చైతూ వండిన చేపల కూర చాలా రుచికరంగా ఉందని, స్థానిక మత్స్యకారులు తెలిపారు. వారు తండేల్ మూవీ విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.