Naga Chaitanya: 'కస్టడీ' తర్వాత మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చై ఓకే చెప్పాడా..?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. యువసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చై.. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తమిళ మాస్ డైరెక్టర్ లింగుస్వామితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 'పందెం కోడి', 'ఆవారా' హిట్స్ అందించిన లింగుస్వామి దర్శకత్వంలో చై సినిమా చేయనున్నారనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
వివరాలు
ఆకట్టుకోని సినిమాలు..
అయితే ఈ వార్తపై అక్కినేని అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న లింగుస్వామి.. ఇటీవల మాత్రం ఆశించిన స్థాయిలో హిట్స్ ఇవ్వలేకపోతున్నారు. రామ్ పోతినేనితో తెరకెక్కించిన 'ది వారియర్' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అలాగే నాగచైతన్య గతంలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేసిన 'కస్టడీ' మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
వివరాలు
సెట్స్ పైకి వెళ్లనున్న కాంబో..రూమరేనా?
దీంతో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న నాగచైతన్య మళ్లీ తమిళ దర్శకుడితో రిస్క్ చేయాల్సిన అవసరముందా? 'తండేల్'తో వచ్చిన మార్కెట్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి నాగచైతన్య-లింగుస్వామి కాంబో నిజంగానే సెట్స్‌పైకి వెళ్తుందా? లేక ఈ వార్త కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.