Page Loader
Nagachaitanya: నాగచైతన్య 25వ చిత్రం.. కొత్త దర్శకుడితో ఆసక్తికర ప్రాజెక్ట్!
నాగచైతన్య 25వ చిత్రం.. కొత్త దర్శకుడితో ఆసక్తికర ప్రాజెక్ట్!

Nagachaitanya: నాగచైతన్య 25వ చిత్రం.. కొత్త దర్శకుడితో ఆసక్తికర ప్రాజెక్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

'తండేల్‌' (Thandel) సినిమాతో కథానాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) మరోసారి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు. అంతే కాకుండా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్‌ కార్తీక్‌ దండా దర్శకత్వంలో ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఈ నెల రెండో వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా అనంతరం చైతన్య తన 25వ చిత్రంపై (NC25) దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వెలువడుతోంది.

Details

త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం

కిశోర్‌ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ చైతన్యకు బాగా నచ్చిందట. ఇందులో తన పాత్ర వైవిధ్యభరితంగా ఉండటంతో ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాణ సంబంధిత విషయాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.