Page Loader
నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల
ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది

నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 15, 2023
06:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య తెరపై తెలుగు-తమిళం ద్విభాషా చిత్రం కస్టడీలో కనిపించనున్నారు. మానాడుతో శింబుకి అద్భుతమైన హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు పోలీస్ నేపధ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. టీజర్ రేపు సాయంత్రం 04:51 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. టీజర్ విడుదల గురించి ప్రస్తావించడానికి నాగ చైతన్య నీటి కింద ట్రక్ డోర్ తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు సాయంత్రం 4.51కి కస్టడీ సినిమా టీజర్ రిలీజ్